ప్రేమకెందుకింత దాహం……తీరనిదీ శోకం……
ఎక్కడిదీ తాపం……ఎక్కడిదీ విరహం……
ప్రేమంటే శాపమా……ప్రేమించటం పాపమా……ప్రేమిస్తే మరణమా……
నిట్టూర్పు అడియాశల్లో……ఎడారి ఎండమావుల్లో ఎందుకీ దాహం……
కలలకు బెదిరిన అశువులు బారిన……
రుధిరపు ధారల చిత్రమే నా రూపమా…….
ముసురులు కప్పిన వురుమిన మేఘం నింగిలో నిలువునా……
గతులకు నిలవక చితికిన బతుకిది మట్టిలో కలియునా……
ప్రణయపు విరహము మనసుని కాల్చుట నీకిది న్యాయమా……
మోడుబార్చే మోహం……చీకటయ్యే లోకం……
భారమయ్యె ప్రాణం……శ్వాసలోను నీ గానం……
కన్నుల్లోన నీ రూపం……నిలిపాలేవే కలకాలం……
మనసులోని నీ ప్రతిబింబం చెరిగిపోదు తరిగిపోదు……
ఎందుకింత ప్రణయం……ఎందుకింత విలయం……
మనిషికి మనసే ఒక శాపమా……
పరువము చిలికిన వయసులు కలిసిన చిహ్నమే నీ దేహమా……
మమతలు పంచిన వలపులు పెంచిన మౌనమే నీ గానమా……
రగిలిన మనసుకు తొలకరి జల్లులు శరణమే నీ త్యాగమా……
తెలియని తలపుల మధురిమ నీవని తలచుటే పాపమా……
ఓడిపోయే మేఘం……నీరుగారే ప్రాణం……
గాలిలోని దీపం……ఆరనీకు పాపం……
నీకోసం చస్తున్నా……కాలంతో నే వెళ్తున్నా......!!!!!!
-------------------------------------------------------Written by
-------------------------------------------------------కృష్ణకాంత్ అంగత.
No comments:
Post a Comment