నా యదను తరిమెను ప్రాయం……
నీ వయిపు లాగెను నీ రూపం……
నా పెదవి పలికెను ఓ మంత్రం……
ఆ మంత్రమయ్యేను నీ నామం……
నా మనసును నిద్దుర లేపావే……
నా వయసుకు రంగులు అద్దావే……
నా ఊహలకు నడకలు నేర్పావే……
నా ఆశల సమిధిలా మారావే……
ఇది రతిన చేరిన……వయసు పడిన……
గతులు చెడిన……తలపు ఘటన……
మనసు పడిన……విరహ నటన……
తనువు పడిన……వలపు తపన……
నీ సొగసులే వసంత ఋతువయి నా ముంగిట వాలెనె……
జగమంతా నీ అందాల హొయల పరదా నన్ను కప్పివేసేనే……
విరహాల ఉప్పెనేలో వరమిచ్చు దేవతవయి నన్ను ఓదార్చవె……
సింధూర వర్ణములో దివికొచ్చు తార వలె నన్ను తాకిపోవే……
మౌనంగా నే వేచి చూస్తున్న……దరిచేర్చుకోవే చిన్నారి......
నీ కంటి రెప్ప వలె నే కాచుకున్న……ఒడిచేర్చుకోవే వయ్యారి……
నీ గుండె ప్రతి లయలోనూ నేనేగా వున్నా……
నీ ఊపిరి వేడిమిలో నే స్వాంతన పొందుతున్నా……
నీ కంటి చూపులకు……కనిపించని వయినంలా……
అలుపెరగని భావంతో……శ్రుతిమించిన వేదనతో……
తొలిసంధ్య వేల భామినితో……
మలిసంధ్య వేల యామినితో……
వెలుగొందిన సూర్యుడిగా……
వాత్సాయనుడిలా నే వ్రాస్తున్నా ఈ గీతం......!!!!!!
-----------------------------------------------------------Written by
-----------------------------------------------------------కృష్ణకాంత్ అంగత.
No comments:
Post a Comment