Thursday, May 21, 2009

కన్నానులే నీ రూపం......

నువ్వేమో నేనయ్……నీవేమో నేనయ్……అవుతా ఈ క్షణం……

నా వేణు గానం……నీ మూగ రాగం……వుండే ఈ క్షణం……

మౌనమే గోదారి వాగయ్……పొంగిందే నీ ప్రేమలాగా……

గుండెల్లోన నీ ఊసులేనా……గువ్వలా నవ్వింది నీలా……

నీ వంపు వలపులే......నెలవంక సొగసులా……

నీ మేని మెలికలే......కావేరి తలపులా……

నీకయ్ వస్తూ……నీలా వస్తూ……నేనయ్ వస్తున్నా……

ఈ నదులే నీ చక్కిళ్ళయ్……సిరులొలికే……

ఈ వనమే నీ కొంగులయ్……మధుచిలికే......

బిందువయ్ వచ్చావా……వెల్లువయ్ మారావా……

మూగపలుకులే……ప్రేమగీతికయ్……

వేణువయ్ వచ్చావా……ఇంతగా మార్చావా……

వలపు తెన్నులే……తీరుతెన్నులయ్……

అది మొదలు నీలా మారి నన్ను మరిచే……

ప్రతి స్వప్నం నీవే అయి కలగలిసే……

నింగికే ఎగిసేనా……తారలా మారేనా……

ఇందువదనలే……విందు చేసేనా……

ప్రేమగా చేరేనా……బంధమయ్ విరిసేనా……

ఇలా నీటి అలలపయ్......నీ రూపమే కంటున్నా......!!!!!!

--------------------------------------------------Written by

---------------------------------------------------------------కృష్ణకాంత్ అంగత.

Wednesday, May 20, 2009

ఇది ప్రణయం......

నా యదను తరిమెను ప్రాయం……

నీ వయిపు లాగెను నీ రూపం……

నా పెదవి పలికెను ఓ మంత్రం……

ఆ మంత్రమయ్యేను నీ నామం……

నా మనసును నిద్దుర లేపావే……

నా వయసుకు రంగులు అద్దావే……

నా ఊహలకు నడకలు నేర్పావే……

నా ఆశల సమిధిలా మారావే……

ఇది రతిన చేరిన……వయసు పడిన……

గతులు చెడిన……తలపు ఘటన……

మనసు పడిన……విరహ నటన……

తనువు పడిన……వలపు తపన……

నీ సొగసులే వసంత ఋతువయి నా ముంగిట వాలెనె……

జగమంతా నీ అందాల హొయల పరదా నన్ను కప్పివేసేనే……

విరహాల ఉప్పెనేలో వరమిచ్చు దేవతవయి నన్ను ఓదార్చవె……

సింధూర వర్ణములో దివికొచ్చు తార వలె నన్ను తాకిపోవే……

మౌనంగా నే వేచి చూస్తున్న……దరిచేర్చుకోవే చిన్నారి......

నీ కంటి రెప్ప వలె నే కాచుకున్న……ఒడిచేర్చుకోవే వయ్యారి……

నీ గుండె ప్రతి లయలోనూ నేనేగా వున్నా……

నీ ఊపిరి వేడిమిలో నే స్వాంతన పొందుతున్నా……

నీ కంటి చూపులకు……కనిపించని వయినంలా……

అలుపెరగని భావంతో……శ్రుతిమించిన వేదనతో……

తొలిసంధ్య వేల భామినితో……

మలిసంధ్య వేల యామినితో……

వెలుగొందిన సూర్యుడిగా……

వాత్సాయనుడిలా నే వ్రాస్తున్నా ఈ గీతం......!!!!!!

-----------------------------------------------------------Written by

-----------------------------------------------------------కృష్ణకాంత్ అంగత.

Saturday, May 16, 2009

ఇది నా మూగ గానం......

ప్రేమకెందుకింత దాహం……తీరనిదీ శోకం……

ఎక్కడిదీ తాపం……ఎక్కడిదీ విరహం……

ప్రేమంటే శాపమా……ప్రేమించటం పాపమా……ప్రేమిస్తే మరణమా……

నిట్టూర్పు అడియాశల్లో……ఎడారి ఎండమావుల్లో ఎందుకీ దాహం……

కలలకు బెదిరిన అశువులు బారిన……

రుధిరపు ధారల చిత్రమే నా రూపమా…….

ముసురులు కప్పిన వురుమిన మేఘం నింగిలో నిలువునా……

గతులకు నిలవక చితికిన బతుకిది మట్టిలో కలియునా……

ప్రణయపు విరహము మనసుని కాల్చుట నీకిది న్యాయమా……

మోడుబార్చే మోహం……చీకటయ్యే లోకం……

భారమయ్యె ప్రాణం……శ్వాసలోను నీ గానం……

కన్నుల్లోన నీ రూపం……నిలిపాలేవే కలకాలం……

మనసులోని నీ ప్రతిబింబం చెరిగిపోదు తరిగిపోదు……

ఎందుకింత ప్రణయం……ఎందుకింత విలయం……

మనిషికి మనసే ఒక శాపమా……

పరువము చిలికిన వయసులు కలిసిన చిహ్నమే నీ దేహమా……

మమతలు పంచిన వలపులు పెంచిన మౌనమే నీ గానమా……

రగిలిన మనసుకు తొలకరి జల్లులు శరణమే నీ త్యాగమా……

తెలియని తలపుల మధురిమ నీవని తలచుటే పాపమా……

ఓడిపోయే మేఘం……నీరుగారే ప్రాణం……

గాలిలోని దీపం……ఆరనీకు పాపం……

నీకోసం చస్తున్నా……కాలంతో నే వెళ్తున్నా......!!!!!!

-------------------------------------------------------Written by

-------------------------------------------------------కృష్ణకాంత్ అంగత.

Tuesday, May 12, 2009

ఇది అపురూపం......

నా పాదం……నీ మువ్వల సవ్వడి వెంట……

నా నయనం……నీ చూపు రేఖల వెంట……

నా పయనం……నీ ఊహల గమ్యం వెంట……

సాగిన జీవికి క్షణ కాలాలన్ని ఓ అపురూపమే……

నా హృదయ నాదానికి……నీ రాగం తోడయితే……

నా ఊహల లలనలకు……నీ ఆశల దీపం చేరువయితే……

నా వయసున వయసయ్……నీ సొగసుల వరుస వరమిస్తే……

పరువంలోని వయసూ ఒక అపురూపమే……

నీ ఉచ్చ్వాస నిశ్వాసలె……నా జీవనాధారలయితే……

సిరులొలుకు నీ నవ్వులే……నా నిరంతర నిర్విరామ తలపులయితే……

వెన్నెల కురిసే వేళలో……స్వర్నముఖిలాంటి నీవు చంద్రముఖివయితే……

కురిసే వెన్నెల ఒక అపురూపమే……

శూన్యానికి…….స్నబ్ధత తోడయి……

స్నబ్ధతకి……శబ్దం తోడయి……

శబ్దానికి……రాగం తోడయి……

ఆ రాగానికి……నీ స్వరం తోడయి……

విరహఝురి ప్రవహించగా......

నా ఊపిరి శ్రుతిలయలనేర్చి……పరవశించదా……!!!!!!

--------------------------------------------------------Written by

--------------------------------------------------------కృష్ణకాంత్ అంగత.

Sunday, May 10, 2009

ఇది నా అంతర్మధనం......

ప్రేమకు ప్రతిరూపం నువ్వన్నావు......

నా మనసుకు ప్రతిబింబం నీవన్నావు......

కానీ నా మనసున ఓ జ్ఞాపకమయి పోయావు……

దారి చూపిస్తానన్నావు……చేరువవుతానన్నావు……

కాలికి ముళ్ళయి……మనసుకు గాయమయి పోయావు……

నా ఆశల రాగానికి పల్లవించు పల్లవి నీవవుతావనుకున్నా……

సాయం సంధ్యా సమయమున……

కోయిల గానానికి విరబూసిన కుసుమం నీవనుకున్నా……

చేతి స్పర్శకు కందిపోయే గులాబి రేకు లాంటి నీకు……తోటమాలి రక్ష నేననుకున్నా……

కానీ ఆ గులాబి వెంబడి ముళ్ళు వుంటాయని తెలిపావు……

నా గమ్యం నీవనుకున్నా……నా మార్గం నీ తలపనుకున్నా……

నా హృదయమనే కాగితం మీద మధురమయిన సంతకం నీదనుకున్నా……

కానీ మోడుబార్చావు……మేడను కూల్చావు……

కడలిన చిక్కుకున్న నావకు సూర్యుడే దిక్సూచి……

ఆ రవి వెలుగులు కూడా శాశ్వతం కాదని……అస్తమించక మానడని ఋజువుచేశావు……

చీకటి జీవితంలో మెరుపు వలె మెరిశావు……

కానీ ఆ మెరుపు వెంట పిడుగు వస్తుందని చాటి చెప్పావు……

ఇది ఆ విధి విధించిన శాపమా……లేక ఆ దేవుని శాసనమా……!!!!!!

--------------------------------------------------------------Written by

--------------------------------------------------------------కృష్ణకాంత్ అంగత.

Thursday, May 7, 2009

నీవే లేకుంటే......

నీ వెంట వుంటే......
ఎడబాటయినా తడబాటే......
నీవే లేకుంటే......

యుగయుగాల ధరణికి మూగ సాక్షిని నెనయ్......
ఆమని సొబగుల వేళ మూగబోయిన కొయిలనయ్......
వలపు ప్రళయంలో చిక్కుకున్న......
దరి చేరలేని నావనయ్......
ఆ విరించి తలపునకు అందని......

వేదనకు పరిభాషగా......
సాగరసంగమం వేళ మిన్నకుండిన మౌనసముద్రమునయ్......

నీ నామమే జపిస్తున్నా......నీ కోసమే తపిస్తున్నా......
ఈ ప్రాణం......ఈ శ్వాస......నీ కోసం......
నీ చిరునవ్వు కోసం పరితపిస్తూ......
సుడిగాలిలో మినుకు మినుకుమంటున్న ఓ చిన్న దీపముగా......
నిలువలేని జ్యోతిగా......
ఈ దీపం ఆరిపోని......

ఈ మూగ గానం ఆగిపోని......
--------------------------------------Written by
--------------------------------------
కృష్ణకాంత్ అంగత.