ప్రభాత సంధ్యా రాగం……
సుప్రభాత వినీల గానం……
విధాత నిశ్చల తపనం……
పశుపతి యోగ నర్తనం……
తత్ప్రణమామి……ఈ వచనం……
కార్తీక దీపం పొడిచిన వేళ……
ఆరుష కిరణం తడిమిన వేళ……
హృదయపు తంత్రుల......సరిగమ స్వరఝురి……
యద లయ మీటిన……ఘన ఘన దుందుభి……
సరిగమలెన్నడు……ఎరుగనది……
స్వరములకెన్నడు……అందనిది……
పదములనెన్నడు......పలకనిది……
ఆ భావంతో……నా గానంతో……
అది న భూతో……న భవిష్యత్తో……
ఈ ఓంకారునాదాను సుమాంజలి……
ఆ రవి తేజమే……నా వెలుగులు……
ఆ పలుకులే……నా స్వరములు……
నీ అందెలే……నా అడుగులు……
పలికిన కిల కిల పదముల స్వరగతి……
గిరులన పొదిగిన అల అల సెలయేరే……
చేసిన జలజల సవ్వడితో......
సాగిన రాగాంజలి……ఈ గీతాంజలి……!!!!!!